7సీస్ గేమ్‌‌‌‌‌‌‌‌కు ఫిక్కీ అవార్డ్‌‌‌‌‌‌‌‌

7సీస్ గేమ్‌‌‌‌‌‌‌‌కు ఫిక్కీ అవార్డ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : గేమింగ్ కంపెనీ 7సీస్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌  బెస్ట్ యానిమేటెడ్‌‌‌‌‌‌‌‌ ఫ్రేమ్స్ (బీఏఎఫ్‌‌‌‌‌‌‌‌) అవార్డ్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. బెస్ట్ ఇండియన్ గేమ్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో  ఫిక్కీ ఈ అవార్డ్‌‌‌‌‌‌‌‌ను అందజేసింది. రోలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోస్టర్  సిమ్యులేటర్ గేమ్‌‌‌‌‌‌‌‌కు గాను ఈ అవార్డ్‌‌‌‌‌‌‌‌ను 7సీస్ దక్కించుకుంది. ఈ గేమ్‌‌‌‌‌‌‌‌ ఏకంగా 20 లక్షల డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్స్‌‌‌‌‌‌‌‌ సాధించిందని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.  

బెస్ట్ ఇండియన్ గేమ్ కేటగిరీలో ఈ అవార్డ్ దక్కడం చాలా ఆనందంగా ఉందని  కంపెనీ ఎండీ ఎల్ మారుతి శంకర్ పేర్కొన్నారు. మరో రెండు గేమ్‌‌‌‌‌‌‌‌లు.. అల్టిమేట్‌‌‌‌‌‌‌‌ కార్ రేసింగ్‌‌‌‌‌‌‌‌, మానెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రక్‌‌‌‌‌‌‌‌ 3డీ..   బెస్ట్‌‌‌‌‌‌‌‌ మొబైల్‌‌‌‌‌‌‌‌ అండ్ టాబ్లెట్‌‌‌‌‌‌‌‌ గేమ్ కేటగిరీలో  ఫైనలిస్ట్‌‌‌‌‌‌‌‌గా నిలిచాయని అన్నారు.