బీహార్‌లో కుల గ‌ణ‌న‌పై స్టే విధించిన హైకోర్టు

బీహార్‌లో కుల గ‌ణ‌న‌పై స్టే విధించిన హైకోర్టు

పాట్నా : బీహార్ ప్రభుత్వం చేప‌ట్టిన కుల గ‌ణ‌న స‌ర్వేను ఆ రాష్ట్ర హైకోర్టు నిలిపివేసింది. ప్రజ‌ల‌ ఆర్ధిక‌, కుల హోదాకు సంబంధించిన డేటాను సేక‌రించేందుకు నితీశ్ కుమార్ స‌ర్కార్ స‌ర్వే చేప‌ట్టింది. ఇంటింటి స‌ర్వేను రాష్ట్రంలోని అన్ని ప్రతిప‌క్ష పార్టీలు స్వాగతించాయ‌ని సీఎం నితీశ్ తెలిపారు. 

‘‘నిజానికి కుల గ‌ణ‌న కేంద్ర ప్రభుత్వం చేప‌ట్టాల్సిన ప్రక్రియ‌. కానీ..  బీహార్‌లో రాష్ట్ర స‌ర్కారు ఆ ప్రక్రియ‌కు శ్రీకారం చుట్టింది’’ అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. సర్వేను వ్యతిరేకిస్తున్న వారిపై నితీష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అవ‌స‌ర‌మైన వారికి సేవ‌లు అందించ‌డంలో స‌ర్వే ఉపయోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు.

తొలి రౌండ్ స‌ర్వే జ‌న‌వ‌రి 7వ తేదీ నుంచి 21వ తేదీ వ‌ర‌కు నిర్వహించారు. ఇక రెండ‌వ స‌ర్వే ఏప్రిల్ 15 నుంచి మే 15వ తేదీ వ‌ర‌కు నిర్వహించనున్నారు.