ఎన్నికలప్పుడే ముస్లింలు గుర్తుకు వస్తారా : జహీర్  అక్తర్

ఎన్నికలప్పుడే ముస్లింలు గుర్తుకు వస్తారా :  జహీర్  అక్తర్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ముస్లింలను మరోసారి మోసం చేయడానికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తామని బీఆర్ఎస్  ప్రభుత్వం ప్రకటించిందని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్  అక్తర్  ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్​ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడినప్పుడే బీఆర్ఎస్ కు మైనార్టీలు గుర్తుకొస్తారని విమర్శించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్  కల్పిస్తామని ప్రకటించి, 9 ఏండ్లు గడుస్తున్నా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.

ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని  ఆరోపించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్  మాట్లాడుతూ మంత్రి హరీశ్​రావు ముస్లింలను ఫకీర్​లని మాట్లాడడం సరైంది కాదన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీజే బెనహర్, అనిత, సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, అజ్మత్ అలీ, జహీర్  పాల్గొన్నారు.  

హరీశ్ రావు దిష్టిబొమ్మ దహనం

గద్వాల టౌన్, వెలుగు : ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి హరీశ్​రావు దిష్టిబొమ్మను కాంగ్రెస్  పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్  చౌరస్తాలో దహనం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఇసాక్  మాట్లాడుతూ మంత్రి వెంటనే ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. మరో సారి ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. జమాల్, ముఖ్రం, మాజీద్, జహంగీర్, రఫీ పాల్గొన్నారు.