
మెదక్, వెలుగు: అవసరమైన స్థల సేకరణ పూర్తికావడం.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం.. స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగడంతో మెదక్ కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్త్వరగా పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ నాలుగున్నరేండ్లు అవుతున్నా కొత్త బిల్డింగ్పనులు ఇంకా పూర్తి కాలేదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016లో మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. ఈ మేరకు పిల్లికొటాల్శివారులోని ప్రైవేట్ బిల్డింగ్అద్దెకు తీసుకుని అందులో కలెక్టరేట్ఏర్పాటు చేశారు. కాగా అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లో అన్ని హంగులతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా మెదక్ లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్క్వార్టర్, 8 జిల్లా స్థాయి అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి రూ.48.61 కోట్లు మంజూరయ్యాయి. ఈ బిల్డింగ్‌ల నిర్మాణం కోసం పట్టణ సమీపంలోని ఔరంగాబాద్ శివారులోని సర్వే నంబర్ 78లో 33 ఎకరాల స్థలాన్ని సేకరించారు. 2018 మే 9న సీఎం కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చాబ్రా అసోసియేట్స్ టెండర్ దక్కించుకోగా, ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో పనులు చేపట్టారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 డిసెంబర్‌లోపు పనులు పూర్తి కావాలి. అయితే కరోనా కారణంగా లేబర్సమస్యతో పనుల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో గడువును 2021 నవంబర్‌నెలాఖరు వరకు పొడిగించారు. అయితే ఆ గడువు కూడా పూర్తియి ఏడాది గడచినా పనులు కలెక్టరేట్ రెడీ కాలేదు. గతేడాది డిసెంబర్ లో సీఎం చేతుల మీదుగా కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ ప్రాంరంభోత్సవం ఉంటుందని ప్రజా ప్రతినిధులు చెప్పారు. కానీ పనులు పెండింగ్ లో ఉండటంతో అది వాయిదా పడింది. మెయిన్ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయినప్పటికీ, పై అంతస్తులో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కాంపౌండ్ వాల్, ఇంటర్నల్ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన నిధులు లేక పనులు చేపట్టలేదు. ఈ పనులకు అవసరమైన నిధుల కోసం ఆర్ అండ్ బీ అధికారులు గతేడాది మేలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కాగా ఆరు నెలల తరువాత గత నవంబర్‌లో ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసింది. కాగా ఈ పనులు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
డిలేపై జడ్పీ చైర్పర్సన్ అసహనం
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ బిల్డింగ్ పనుల జాప్యంపై శుక్రవారం జరిగిన జడ్పీ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ఆర్ అండ్ బీ అధికారులను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆర్అండ్ బీ డీఈఈ వెంకటేశం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ మెయిన్ బిల్డింగ్ పనులు పూర్తికాగా, సెకండ్ ఫ్లోర్ లో సీలింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆ పనులు త్వరలో పూర్తవుతాయని, ఇటీవల మంజూరైన రూ.9 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతామని చెప్పారు.