సెప్టెంబర్‌‌లో భారీగా సినిమాల విడుదల

సెప్టెంబర్‌‌లో భారీగా సినిమాల విడుదల

సెప్టెంబర్ నెలలో సినిమాలు దండయాత్ర చేయనున్నాయి. ఇందులో యంగ్ హీరోల సినిమాలతో పాటు.. చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. డబ్బింగ్ మూవీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమౌతున్నాయి. ఇందులో ఒకే రోజున రిలీజ్ అవుతుండడం విశేషం. సెప్టెంబర్ 002వ తేదీన యుంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’  విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 09వ తేదీన శర్వానంద్ హీరోగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్ కాబోతోంది. ఇదే రోజున ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఇందులో సత్యదేవ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించారు.

కిరణ్ అబ్బవరం దర్శకత్వం వహించిన ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ సెప్టెంబర్ 09వ తేదీన రిలీజ్ అవుతోంది. సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీతో పాటు.. రెజీనా, నివేథ థామస్ నటించిన ‘శాకిని డాకిని’ మూవీస్  సెప్టెంబర్ 16న థియేటర్లలోకి వస్తున్నాయి. సెప్టెంబర్ 23 న..నాగశౌర్య నటించిన..‘కృష్ణ వ్రింద విహారి’ మూవీతో పాటు...శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ మూవీస్ ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు కూడా ఇదే నెలలో విడుదల కావాడానికి రెడీ అవుతున్నాయి. ఆగస్టులో విడుదలైన చిత్రాల్లో హిట్ టాక్ సంపాదించుకున్నాయి. మరి సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాలి.