
నెలలో మూడు, నాలుగు సార్లు ఇదే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: ఉస్మాన్ సాగర్(గండిపేట) నుంచి ఆసీఫ్ నగర్ ఫిల్టర్‌కు నీటిని తరలించే కాలువ ప్రమాదకరంగా మారింది. కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, షేక్ పేట, హకీంపేట మీదుగా 14.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ కాలువ రోడ్డుపై ఉంది. దీని మీదుగా లోడుతో హెవీ వెహికల్స్వెళ్లిన ప్రతిసారి ఎక్కడో ఒకచోట కుంగుతోంది. వెహికల్స్ రోడ్డు మీద ఇరుక్కుపోయి భారీగా ట్రాఫిక్జామ్ఏర్పడుతోంది. ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తున్నా కుంగడం మాత్రం ఆగడం లేదు.
మోటార్ల అవసరం లేకుండా ఆసిఫ్నగర్ఫిల్టర్కు నీటి సరఫరా చేస్తున్నారు. అయితే ఉస్మాన్సాగర్నీళ్లు సిటీకి అవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, డైలీ ఈ కాల్వ నుంచి నీటి సప్లయ్ జరుగుతూనే ఉంది. ఈ క్రమలో నెలలో మూడు, నాలుగుసార్లు వెహికల్స్ దిగబడుతున్నాయి. వాటర్‌బోర్డు అధికారులకు ఇదో పెద్ద తలనొప్పిగా మారింది. ఇరుక్కుపోయిన వెహికల్స్‌ను తొలగించే వరకు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలుస్తోంది. తాజాగా సోమవారం తెల్లవారుజామున ఓ లారీ దిగబడింది. దాన్ని బయటికి తీసేందుకు మధ్యాహ్నం అయింది.
అన్నిచోట్ల ఇంతే.
కోకాపేట నుంచి నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, షేక్ పేట, హకీంపేట, ఆసీఫ్ నగర్ వరకు అన్ని ప్రాంతాల్లోనూ కాలువ ప్రమాదకరంగా ఉంది. హెవీ వెహికల్స్కాలువపైకి రాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా వస్తున్న వెహికల్స్లోడుకు తగినట్టు కాలువపై క్యాపింగ్ చేయడం లేదు. కొన్నిచోట్ల కాలువ పైకప్పు ఓపెన్ చేసి ఉంటోంది. ఇటీవల నార్సింగి వద్ద ఓ లేగదూడ కాలువలో పడగా, చివరకు ఆసిఫ్ నగర్ ఫిల్టర్ లో తేలింది. అయితే లేగదూడ ప్రాణాలతో బయటపడింది. జలమండలి అధికారులు గుర్తించి యజమానికి అప్పగించారు. లేగదూడ స్థానంలో మనుషులు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
పైప్‌లైన్ వేసి వాడట్లే..
జంటజలాశయాల నీరు అవసరం లేదని, సిటీ అవసరాలకు వాడట్లేదని గతంలో సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ రెండింటి నీటిని కొంత వినియోగిస్తున్నారు. ప్రస్తుతం గండిపేట నుంచి డైలీ 51 మిలియన్ లీటర్లను తాగునీటి కోసం వాడుతున్నారు. ఇదంతా కాలువ ద్వారానే జరుగుతోంది. తరచూ కుంగుతుండడంతో హిమాయత్ సాగర్ తరహాలో ఇక్కడ కూడా పైపులైన్ నిర్మించారు. కానీ దాన్ని వినియోగించడంలేదు. వినయోగించేందుకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. పనులు పూర్తయ్యాక కూడా ఎందుకు వాడట్లేదనే దానిపై క్లారిటీ లేదు.