దేశంలో జైళ్ల కెపాసిటీ 4.03 లక్షలు.. ఖైదీలు 4.78 లక్షలు

దేశంలో జైళ్ల కెపాసిటీ 4.03 లక్షలు.. ఖైదీలు 4.78 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో జైళ్లు కిక్కిరిసిపోయాయి. అన్ని జైళ్లలో కలిపి 4.03 లక్షల మంది ఖైదీలకు సౌకర్యాలు ఉండగా, 4.78 లక్షల మందిని ఉంచారు. మరో వైపు జైళ్లలో 26 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్ బీ) 2019కి రిలీజ్‌ చేసిన రిపోర్టు లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2017లో 3.91 లక్షల మంది ఖైదీలకు సరిపోయేలా జైళ్లు ఉండగా, 2019కి 4.03 లక్షలకు కెపాసిటీ పెంచారు. 2018లో 4.66 లక్షల మంది ఉండగా 2019లో 4.78 లక్షలకు పెరిగింది. అన్ని సెంట్రల్ జైళ్లలో కలిపి 1.77 లక్షల మందికి సౌకర్యాలు ఉండగా, 2.20 లక్షల మంది ఖైదీలను ఉంచారు. 2019 చివరి నాటికి దేశంలోని అన్ని జైళ్ళకు కలిపి 87,599 పోస్టులు శాంక్షన్ అయ్యాయి. వీటిలో 60,787 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. డీజీ, అడిషనల్ డీజీ, ఐజీ, డీఐజీ, ఏఐజీ, సూపరింటెండెంట్, తదితర పోస్టులు కలిపి 26,812 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కృ

see more news

తెలంగాణలో కొత్తగా 1873 కేసులు..9 మంది మృతి

ఒక్కరోజే 78,512 కేసులు..971 మరణాలు

మెట్రోలో ట్రావెల్‌ చేయాలంటే..స్మార్ట్ కార్డు,మాస్క్‌ కంపల్సరీ

దారుణం..మూతికి టేప్​వేసి క్యాండిల్​తో కాల్చిన అమ్మమ్మ