నాకౌంట్ దశనుంచి వెనుదిరిగిన పోర్చుగల్ 

నాకౌంట్ దశనుంచి వెనుదిరిగిన పోర్చుగల్ 

ఏ అంతర్జాతీయ ఆటగాడికైనా జీవితంలో ఒక్కసారైనా వరల్డ్ కప్ ని ముద్దాడాలనే కల ఉంటుంది. అయితే, ప్రపంచ మేటి ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కెరీర్  మాత్రం ఆ కల నెరవేరవేరకుండానే ముగిసింది. 37 ఏండ్ల రొనాల్డోకి మరోసారి ప్రపంచకప్ ఆడే అవకాశాలు దాదాపు లేనట్టే. అయతే, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో పోర్చుగల్ టీం  మొకాకోతో ఓడిపోవడంతో రొనాల్డో ఆశలు ఆవిరయ్యాయి. దాంతో మైదానంలో రొనాల్డో ఏడ్చేశాడు. అతడు కన్నీళ్లు తుడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రొనాల్డో తన కెరీర్ లో 195 మ్యాచ్ లు ఆడి, 118 గోల్స్ చేశాడు.

అయితే, కీలకమైన నాకౌట్ మ్యాచ్ ల్లో రొనాల్డోని ఆడించకుండా బెంచ్ కే పరిమితం చేయడంపై జట్టు మేనేజర్ ఫెర్నాండో శాంటోస్ వివాదాస్పదంలో చిక్కుకున్నాడు. అతన్ని జట్టు మేనేజర్ గా తొలగించొచ్చనే వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన శాంటోస్ ‘జట్టు ప్రయోజనాలకోసమే ఈ నిర్ణయం తీసుకున్నా. స్విట్జర్లాండ్ పై గెలిచిన జట్టునే బరిలోకి దింపా. రొనాల్డో విషయం వ్యహాత్మకమైంది. దాంట్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’ అన్నాడు.