ఒప్పందం ప్రకారమే బియ్యం తీస్కుంటున్నం

ఒప్పందం ప్రకారమే బియ్యం తీస్కుంటున్నం
  • లోక్ సభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్​ జ్యోతి
  • 2014 తర్వాత తెలంగాణ నుంచి సేకరణ పెంచినమని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: 2021–-22 ఖరీఫ్​ సీజన్​ నుంచి బాయిల్డ్ రైస్ తీసుకోబోమని రాష్ట్రాలకు ముందుగానే సమాచారం ఇచ్చామని, రాష్ట్రాలతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారమే బియ్యాన్ని సేకరిస్తున్నట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి స్పష్టం చేశారు.  -బాయిల్డ్ రైస్‌‌‌‌‌‌‌‌ను తమ అవసరాల కోసం రాష్ట్రాలు సేకరించుకోవచ్చని సూచించామన్నారు. -బాయిల్డ్ రైస్ వినియోగించే తమిళనాడు, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు సొంతంగా సేకరించుకోవడం వల్ల కేంద్రం నుంచి ఆ రాష్ట్రాలకు సరఫరా తగ్గిందని చెప్పారు. బుధవారం లోక్ సభలో ఎంపీ దుష్యంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014 తర్వాత తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సేకరణను పెంచుతున్నామన్నారు. 2015–-16 ఏడాదికి గాను 6.05 లక్షల టన్నులు, 2016–-17 కు గాను 24.75 లక్షల టన్నులు, 2017–-18కి గాను 23.76 లక్షల టన్నులు, 2018-–19కి గాను 26.77 లక్షల టన్నులు, 2019–-20కి గాను 44.71 లక్షల టన్నులు, 2020–-21కి  గాను 47.49 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించామన్నారు.