కరోనా విజృంభణతో బీజింగ్ లో కఠిన ఆంక్షలు

కరోనా విజృంభణతో బీజింగ్ లో కఠిన ఆంక్షలు

బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్ మరోసారి కఠిన ఆంక్షల పరిధిలోకి వెళ్లింది. జీరో కోవిడ్ పాలసీకి అనుగుణంగా ఆదివారం (మే 22) నుంచి మరోసారి బీజింగ్ లో లాక్ డౌన్ విధించారు. చైనా ఎన్ని ఆంక్షలు విధించినా కొత్త ప్రదేశాల్లో కరోనా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో మరిన్ని నగరాల్లోనూ లాక్ డౌన్ విధిస్తున్నారు. హయిడియన్, చావో యాంగ్, ఫెంతాయ్, షన్ యి, ఫాంగ్ షాన్ జిల్లాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

రెస్టారెంట్లు, ఫార్మసీలు మినహా థియేటర్లు, జిమ్ లు, షాపింగ్ మాల్స్ మూసేశారు. పార్కులను మాత్రం 30శాతం సామర్థ్యంతో నిర్వహించవచ్చని చెప్పారు. బీజింగ్ లోని ఈ ఐదు జిల్లాలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మే 28వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

సర్కారు వారి పాట సినిమాతో మహేశ్ మరో రికార్డు

255 చెట్లకు ప్రాణప్రతిష్ట