నకిరేకల్ టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు

నకిరేకల్ టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు
  • టీఆర్ఎస్​ ఎమ్మెల్యే చిరుమర్తి, మాజీ ఎమ్మెల్యే వీరేశం వర్గీయుల మధ్య ఘర్షణ

నకిరేకల్, వెలుగు: నల్గొండ జిల్లా నకిరేకల్‌‌లో మే డే సందర్భంగా జెండా ఎగురవేసే కార్యక్రమంలో టీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గీయుల మధ్య గొడవ జరిగింది. నకిరేకల్‌‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయుల కార్మిక నేతలు ఆదివారం మే డే సందర్భంగా జెండా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు పట్టణంలోని చీమలగడ్డ, బస్టాండ్‌‌ సెంటర్, ఇందిరా గాంధీ సర్కిల్‌‌ వద్ద జెండా ఎగురవేయాలని నిర్ణయించారు. అయితే, ఇందిరా గాంధీ సర్కిల్ వద్ద ఇరు వర్గాలు జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించడం గొడవకు దారితీసింది. 
దిమ్మెకు డాంబర్​పూయడంతో..
ఇందిరా గాంధీ సర్కిల్ వద్ద పార్టీకి సంబంధించి రెండు దిమ్మెలు ఉండగా, ఒక దాని పైన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గీయులు, రెండోదాని పైన వీరేశం వర్గీయులు జెండా ఎగురవేసేందుకు శనివారమే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే రెండో దిమ్మె వద్ద వీరేశం వర్గీయులు ఏర్పాటు చేసుకున్న దిమ్మెకు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం డాంబరు పూశారు. దీంతో ఆదివారం ఉదయం మళ్లీ వీరేశం వర్గీయులు అదే దిమ్మెపై రంగులు వేసి జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ దిమ్మె వద్ద జెండా ఎగురవేయడానికి వీల్లేదని, టీఆర్ఎస్ ​పార్టీ వాళ్లే జెండా ఎగురవేయాలని చిరుమర్తి వర్గీయులు గొడవకు దిగారు. పార్టీ దిమ్మెపైన జెండా ఎగురవేయడానికి వీల్లేదని, మీరు టీఆర్ఎస్ ​పార్టీకి చెందిన వారు కాదని అడ్డుకున్నారు.

దీంతో వీరేశం వర్గీయులు ఆ దిమ్మెను కాదని అదే ప్రాంతంలో మరో చోట జెండా ఎగురవేయాలనుకున్నారు. దీనికోసం ఏర్పాట్లు జరుగుతుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. వీరేశం వర్గీయులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి నకిరేకల్ కు చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. వీరేశం వర్గీయులు పోలీసుల అదుపులోనే ఉండటంతో విషయం తెలుసుకున్న బీసీ కార్పొరేషన్​మాజీ చైర్మన్​పూజర్ల శంభయ్య పోలీస్​స్టేష న్​కు వెళ్లి మాట్లాడారు. 

 


 

ఇవి కూడా చదవండి

లక్షల్లో ఫాలోవర్లు..ఒక్క పైసా తీసుకోడు 

మట్టి పాత్రలో ద్రాక్షపండ్లు..ఆరు నెలల వరకు చెడిపోవు

ఊరు చిన్నదే.. ఎంజాయ్​మెంట్​కు మాత్రం తక్కువ లేదు