కనీస మద్దతు ధరపై చట్టం చేయాలె

కనీస మద్దతు ధరపై చట్టం చేయాలె

వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన స్ట్రాటజీపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. సోనియా గాంధీ ఇంట్లో మీటింగ్ జరిగింది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరీ, ఆనంద్ శర్మ, జైరాం రమేష్ లాంటి నేతలు పాల్గొన్నారు. రైతు సమస్యలు, MSP, పెట్రోల్-డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం లాంటి ప్రజా సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని మీటింగ్ తర్వాత మల్లికార్జున ఖర్గే చెప్పారు. సరిహద్దుల్లో చైనా చర్యలు, జమ్మూకశ్మీర్ లో పరిస్థితులను కూడా లేవనెత్తుతామన్నారు. కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని కూడా డిమాండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.