జనం కోసం కంపెనీల ఖర్చు రూ. 1.09 లక్షల కోట్లు

జనం కోసం కంపెనీల ఖర్చు రూ. 1.09 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: కార్పొరేట్‌‌‌‌‌‌‌‌ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) కింద గత ఏడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1.09 లక్షల కోట్లను కంపెనీలు ఖర్చు చేశాయని కార్పొరేట్ అఫైర్స్‌‌‌‌ మినిస్ట్రీ పేర్కొంది. హెల్త్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌ను మెరుగుపరిచేందుకు,పేదరికాన్ని తగ్గించేందుకు కంపెనీలు ఈ ఖర్చు చేశాయని వివరించింది.  కంపెనీలు తమ మూడేళ్ల సగటు యాన్యువల్ ప్రాఫిట్‌‌‌‌లో 2 శాతాన్ని సీఎస్‌‌‌‌ఆర్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది.   కంపెనీస్ చట్టంలో సీఎస్‌‌‌‌ఆర్ ప్రొవిజన్‌‌‌‌ను పెట్టినప్పటి నుంచి కంపెనీలు పాజిటివ్‌‌‌‌గా రెస్పాండ్ అవుతున్నాయని  కార్పొరేట్ అఫైర్స్ సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ అన్నారు. ‘2014–15 నుంచి 2020–21 మధ్య కంపెనీలు సీఎస్‌‌‌‌ఆర్ కింద రూ. 1.09 లక్షల కోట్లను వేరు వేరు చర్యల కోసం ఖర్చు చేశాయి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
వింత వైరస్.. తైవాన్ జామ రైతులకు నష్టాలు
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు