మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పై కేసు నమోదు చేశారా..? లేదా : ప్రజాప్రతినిధుల కోర్టు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పై కేసు నమోదు చేశారా..? లేదా : ప్రజాప్రతినిధుల కోర్టు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఎన్నికల అఫిడవిట్‌ టాంపరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. శ్రీనివాస్‌గౌడ్‌, అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయాలని ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదని.. వారిపై మహబూబ్‌నగర్‌ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేంద్ర రాజు మరోసారి కోర్టును ఆశ్రయించారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కేసు నమోదు చేశారా..? లేదా..? ఒకవేళ నమోదు చేసి ఉంటే ఎఫ్‌ఐఆర్‌ సహా పూర్తి వివరాలు శుక్రవారం (ఆగస్టు 11) సాయంత్రంలోగా కోర్టుకు సమర్పించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ), పోలీసులను ఆదేశించింది. మహబూబ్‌నగర్‌ పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయకపోతే.. దాన్ని కోర్టు ఉల్లంఘన కింద భావించాల్సి వస్తుందని న్యాయస్థానం పేర్కొంది.