తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ గుడి తెరుచుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, ఆర్మీ బ్యాండ్ మేళాల మధ్య ఆలయ తలుపులు తెరిచారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పున: ప్రారంభం సందర్భంగా ఆలయాన్ని  పూలమాలలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయ సందర్శనకు వచ్చే భక్తుల కోసం సైన్యం బందోబస్తు నిర్వహిస్తోంది. 

గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల సందర్శనను చార్ ధామ్ యాత్ర అంటారు. కరోనాతో రెండేళ్ల పాటు ఈ యాత్ర నిలిచిపోయింది. అయితే కరోనా తగ్గడంతో ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు అనుమతించారు. అక్షయ తృతీయ రోజున యాత్ర ప్రారంభమైంది. ఈ నెల 3న ఉదయం గంగోత్రి, మధ్యాహ్నం యమునోత్రి ఆలయాలు తెరిచారు. ప్రత్యేక పూజలు చేసి భక్తులను అనుమతించారు. గంగోత్రికి రోజుకు 7వేల మందిని, యమునోత్రికి రోజుకు 4 వేల మంది భక్తులకు పర్మిషన్ ఇస్తున్నారు. ఈ నెల 6న కేదార్ నాథ్ ఆలయాన్ని తెరిచారు. ఈ గుడికి రోజుకు 12 వేల మందిని అనుమితిస్తున్నారు. ఇవాళ ఉదయం బద్రీనాథ్ ఆలయం ఓపెన్ అయింది. ఈ గుడికి 15 వేల మంది భక్తులకు పర్మిషన్ ఇస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం కాదు.. నిజాం వారసుడు

కొత్త మెడికల్ కాలేజీలకు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు