ఫ్యాన్స్ మధ్యలోనే ఐపీఎల్ ఆట !

ఫ్యాన్స్ మధ్యలోనే ఐపీఎల్ ఆట !

ఇంటర్నేషనల్‌ క్రికెట్ ‌రీస్టార్ట్ ‌‌అయినా ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతుండడంతో ఫ్యాన్స్ ‌ఆటను మునుపటిలా ఎంజాయ్‌‌ చేయలేకపోతున్నారు. అయితే ఐపీఎల్‌‌కు మాత్రం ఈ విషయంలో మినహాయింపు దొరికేలా ఉంది. ఈసారి లీగ్‌‌కు ఆతిథ్యమివ్వనున్న ఎమిరేట్స్‌‌ క్రికెట్ ‌‌బోర్డు(ఈసీబీ) స్టేడియంలోకి ఫ్యాన్స్‌‌ను అనుమతించాలని భావిస్తోంది. తమ గవర్నమెంట్ ‌‌కూడా ఇందుకు ఓకే అంటుందని నమ్మకంగాఉంది. బీసీసీఐ నుంచి స్టాండర్డ్ ‌‌ఆపరేటింగ్ ప్రొసీజర్‌‌(ఎస్‌‌ఓపీ) అందిన వెంటనే తమ గవర్నమెంట్ ‌‌నుంచి అనుమతి తీసుకుంటామని ఈసీబీ సెక్రటరీ ముబాషిర్ ఉస్మాని అన్నారు.

‘ ఇండియన్ ‌‌గవర్నమెంట్ ‌‌బీసీసీఐకి అనుమతిస్తే ఐపీఎల్ ‌‌యూఏఈలో జరగడం ఖాయం. బీసీసీఐ వైపు నుంచి అంతా ఓకే అయితే మేము మా గవర్నమెంట్ ‌‌పర్మిషన్ ‌తీసుకుంటాం. స్టేడియంలోకి ఫ్యాన్స్‌‌ను అనుమతించాలని మేము అనుకుంటున్నాం. మా ప్రజలు ఇంత పెద్ద ఈవెంట్‌‌ను మిస్ ‌‌అవ్వకూడదనేది మా ఉద్దేశం. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నఈవెంట్లకు వెన్యూ కెపాసిటీలో 30 నుంచి 50 శాతం మందిని అనుమతిస్తున్నారు. ఐపీఎల్‌‌విషయంలోనూ అదే ప్లాన్ లో ఉన్నాం. గవర్నమెంట్ ‌ఓకే అంటుందని నమ్మకముంది ’ అని ఉస్మాని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..