గవర్నమెంట్ స్కూల్స్‌లో విద్యార్థులు లేక.. 1671 పాఠశాలలు మూతపడనున్నాయ్

గవర్నమెంట్ స్కూల్స్‌లో విద్యార్థులు లేక.. 1671 పాఠశాలలు మూతపడనున్నాయ్

ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు వరుసగా మూసివేస్తూ వస్తున్నారు. అక్కడ విద్యా వ్యవస్థ దారుణంగా ఉందని ఆ రాష్ట్ర విద్యాశాఖ ఆందోళన చెందుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 3573 స్కూల్స్ లో విద్యార్థులు చేరడం లేదని తెలిపారు. వాటిలో 1671 ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నట్లు విద్యాశాఖ కార్యాలయం ప్రకటించింది.

ఆయా స్కూల్స్ లో 10మంది లేదా అంతకన్నా తక్కువగా జాయిన్ అవుతున్నారని తేలింది. మూసివేసిన స్కూల్స్ స్థానాల్లో ఫిన్ ల్యాడ్ విద్యా విధానంలో స్కూల్స్ పెట్టాలని ఉత్తరాఖాండ్ గవర్నమెంట్ ఆలోచిస్తోంది. ఈక్రమంలోనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి 4 రోజులు ఫిన్ ల్యాండ్ పర్యటన చేశారు. విద్యా వ్యవస్థను పూర్తిగా తీర్చి దిద్దాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మూసివేసిన స్కూల్ బిల్డంగులను అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ ఆఫీసులుగా వాడనున్నారు.

Also Read: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అప్లై చేసుకోండి..