సుఖేశ్‌ గుప్తాను కస్టడీకి అనుమతిచ్చిన ఈడీ కోర్టు

సుఖేశ్‌ గుప్తాను కస్టడీకి అనుమతిచ్చిన ఈడీ కోర్టు

ఎంబీఎస్ జ్యువెలర్స్ డైరెక్టర్ సుఖేశ్‌ గుప్తాను కస్టడీలోకి తీసుకునేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టు అనుమతి ఇచ్చింది. సుఖేశ్‌ గుప్తాను తొమ్మిది రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నెల 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకూ సుఖేశ్‌ గుప్తా ఈడీ కస్టడీలో ఉండనున్నారు. 9 రోజుల పాటు సుఖేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకోని అన్ని కోణాల్లో ఈడీ అధికారులు విచారించనున్నారు. 14 రోజుల కస్టడీకి కోరగా.. తొమ్మిది రోజులకు ఈడీ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సుఖేశ్‌ గుప్తా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈనెల 25వ తేదీన చంచల్ గూడ జైలు నుండి సుఖేశ్‌ గుప్తాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 

మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు చేసిన సోదాల్లో దాదాపు రూ.149 కోట్ల బంగారు ఆభరణాలు, రూ.1.96 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎంఎంటీసీకి సుఖేష్ గుప్తా రూ.504కోట్ల భారీ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంఎంటీసీ సంస్థ కొనుగోలు చేసిన బంగారం అమ్మకాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. సుఖేశ్ గుప్తాను కస్టడీలో తీసుకుని విచారించడం వల్ల మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ అధికారులు చెబుతున్నారు.