
జగిత్యాల, వెలుగు: పారిపోయిన ప్రేమ జంటను నమ్మించి ఇంటికి పిలిపించి కొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్ నగర్ కు చెందిన శాప భరత్‌చంద్ర, స్థానిక మోచి బజార్ కు చెందిన బొంగని శివాని ప్రేమించుకున్నారు. ఇటీవల యువకుడి తల్లిదండ్రులు అతనికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్చేశారు. దాంతో వారం రోజుల క్రితం శివాని, భరత్ఇంటి నుంచి వెళ్లిపోయారు.2 రోజుల క్రితం తామే పెళ్లి చేస్తామని పేరెంట్స్నమ్మకంగా చెప్పడంతో భరత్యువతితో కలిసి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని టైంలో భరత్తల్లి అరుణ శివానిపై ఇనుప రాడ్డుతో దాడి చేసింది. ఈ క్రమంలో యువతి తీవ్ర గాయాలపాలైంది. గమనించిన స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం శివానికి సీరియస్‌గా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.