ఫాస్టెస్ట్ ‌‌ గ్రోయింగ్ ‌‌ టెక్నాలజీ  ఇన్​ఫ్లుయెన్సర్

ఫాస్టెస్ట్ ‌‌ గ్రోయింగ్ ‌‌ టెక్నాలజీ  ఇన్​ఫ్లుయెన్సర్

మామూలుగా టెక్ యూట్యూబ్ ‌‌ఛానెల్​లో సీరియస్ కంటెంట్ ‌‌ పోస్ట్ చేస్తుంటారు. కానీ.. శ్రీవాస్తవ టెక్ ‌‌ఛానెల్​ని కూడా చాలా ఫన్నీ వేలో నడుపుతున్నాడు. రివ్యూ, అన్ ‌‌బాక్సింగ్ ‌‌.. ఇలా ఏ వీడియో అయినా తనదైన స్టయిల్​లో కామెడీగా చేస్తుంటాడు. అది నచ్చి అతని ఛానెల్​ని ఇప్పటివరకు 93 లక్షల మందికి పైగా సబ్ ‌‌స్క్రయిబ్ చేసుకున్నారు. అంతేకాదు శ్రీవాస్తవకు ఫాస్టెస్ట్ ‌‌ గ్రోయింగ్ ‌‌ టెక్నాలజీ  ఇన్​ఫ్లుయెన్సర్ ‌‌లలో ఒకడిగా పేరొచ్చింది. 

శ్లోక్ శ్రీవాస్తవ చేసే వీడియోలు కాస్త ఫన్నీగా ఉంటాయి. వాటిలో కంటెంట్ మాత్రం క్వాలిటీగా ఉంటుంది. అందుకే ఫేమస్ అయ్యాడు. శ్రీవాస్తవ ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో1995లో పుట్టాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశాడు. అతనికి చిన్నప్పటి నుంచి సైన్స్, కొత్త గాడ్జెట్స్, టాయ్స్ ‌‌మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఆ విషయాలను అందరితో పంచుకోవాలని... వీడియోలు చేసి సోషల్ ‌‌ మీడియాలో పోస్ట్ చేశాడు. అలా తను పదో తరగతి చదువుతున్నప్పుడే వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అయితే.. మొదట్లో ఇంగ్లీష్​లో వీడియోలు చేయడం వల్ల అంత రీచ్ ‌రాలేదు. 

మొదట్లో.. 

శ్రీవాస్తవ ఇంగ్లీష్​లో ‌‌చేసిన వీడియోలు ఎవరూ పెద్దగా చూడలేదు. అప్పట్లో అతని దగ్గర వీడియోలు చేయడానికి కావాల్సిన ఎక్విప్​మెంట్ లేదు. ఫోన్ ‌‌ కెమెరాతో వీడియోలు తీసి, వాళ్ల నాన్న ల్యాప్​టాప్​లో ఎడిటింగ్​ చేసేవాడు. తర్వాత 2014లో ‘టెక్ ‌‌ బర్నర్‌‌‌‌’ అనే యూట్యూబ్ ఛానెల్ ‌‌ పెట్టాడు. మొదట్లో వీడియోలకు అంత రెస్పాన్స్​ రాలేదు. హిందీలో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అప్పటివరకు ఉన్న సబ్ ‌‌స్క్రయిబర్లలో చాలామంది అన్​ స్ర్కయిబ్​‌‌ చేసుకున్నారు. ఫాలోవర్స్ పెరుగుతారు అనుకుంటే తగ్గారు. అయినా.. వెనక్కి తగ్గకుండా హిందీలోనే వీడియోలు చేశాడు. తర్వాత కొన్ని రోజుల్లోనే ఛానెల్​కు రీచ్ బాగా పెరిగింది.  
ఫన్నీగా.. 
శ్రీవాస్తవ మొదట్లో చేసిన వీడియోల్లో సీరియస్​గానే ఉండేవాడు. కానీ.. అలా ఉండడం అతని వల్ల కాలేదు. ఎప్పుడూ ఫన్నీగా ఉండే అతను వీడియోల్లో నటిస్తున్నట్టు అనిపించింది. దాంతో తన ఫ్రెండ్స్​తో ఎలా మాట్లాడతాడో అలాగే వీడియోల్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్ని వీడియోల్లో జోక్స్ కూడా చెప్పేవాడు. ఆ స్టయిల్ ‌చాలా మందికి నచ్చింది. ఛానెల్​ చూసేవాళ్ల సంఖ్య పెరిగింది.

ఉద్యోగం వద్దనుకుని..

బీఈ చివరి ఏడాదిలో ఉన్నప్పుడు కాలేజీలో ప్లేస్​మెంట్స్ కోసం ఇంటర్వ్యూలు జరిగాయి. కానీ.. అతనికి జాబ్ చేయడం ఇష్టం లేదు. అప్పటికి అతని ఛానెల్​ని పది వేల మంది మాత్రమే సబ్ ‌‌స్క్రయిబ్ ‌‌ చేసుకున్నారు. యూట్యూబ్ ‌‌నుంచి నెలకు రెండు వేల రూపాయల కంటే తక్కువే వచ్చేవి. దాంతో శ్రీవాస్తవ అమ్మానాన్న జాబ్ ‌చేయమని ఒత్తిడి చేశారు. ‘‘రెండేండ్లపాటు నాకు నచ్చిన పని చేయనీయండి. సక్సెస్ ‌‌ కాకపోతే జాబ్ చేస్తా” అని చెప్పి వాళ్లని ఒప్పించాడు. యూబ్యూబ్‌‌నే కెరీర్​గా ఎంచుకున్నాడు. రెండేండ్ల కంటే తక్కువ టైంలోనే సక్సెస్ ‌‌అయ్యాడు. ఛానెల్ ‌‌నుంచి డబ్బు రావడం మొదలయ్యాక వాళ్ల అమ్మానాన్న కూడా మెచ్చుకున్నారు. అయితే.. శ్రీవాస్తవకు ఈ సక్సెస్ అంత ఈజీగా రాలేదు. మొదట్లో చాలా కష్టపడ్డాడు. అతని దగ్గర సరైన కెమెరా కూడా ఉండేది కాదు. కెమెరా, మైక్రోఫోన్ అద్దెకు తెచ్చుకుని వీడియోలు చేసేవాడు. 

ఆరు ఛానెల్స్​

ప్రస్తుతం శ్రీవాస్తవ టెక్ బర్నర్​తో పాటు మరో ఐదు ఛానెళ్లను నడుపుతున్నాడు. శ్లోక్ శ్రీవాస్తవ అనే ఛానెల్ ‌‌కు దాదాపు ఐదు లక్షల మంది సబ్ ‌‌స్ర్కయిబర్స్ ‌‌ఉన్నారు. ఇందులో వ్లాగ్స్ ‌‌ అప్​లోడ్ ‌‌ చేస్తుంటాడు. ‘టెక్ ‌‌ బర్నర్ ‌‌‌‌షార్ట్స్’ ఛానెల్​కు 30 లక్షల మంది సబ్ ‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇందులో షార్ట్ వీడియోలు పోస్ట్ ‌‌చేస్తుంటాడు. ‘బర్నర్ ‌‌బైట్స్’ ఛానెల్​కు1.74 లక్షలు, ‘బర్నర్ బైట్స్ షార్ట్స్’​కు 32.5 వేలు, ‘ఓవర్ ‌‌లేస్ ‌‌క్లాతింగ్’​కి 45 వేల మంది సబ్ ‌‌స్క్రయిబర్స్ ఉన్నారు. వీటిని మెయింటెయిన్ ‌‌ చేసేందుకు శ్రీవాస్తవ దగ్గర పదిహేను మంది పనిచేస్తున్నారు. వాళ్లలో నలుగురు అతని ఫ్రెండ్స్‌‌. 

నెట్ ‌‌వర్త్ ‌‌ 

శ్రీవాస్తవ ఇప్పుడు యూట్యూబ్​లో దూసుకుపోతున్నాడు. చాలా తక్కువ టైంలో అతని ఛానెల్​కి మంచి పేరొచ్చింది. ఇతను కూడా దేశంలోని రిచెస్ట్ ‌‌ యూట్యూబర్స్ ‌‌ లిస్ట్​లో చేరిపోయాడు. శ్రీవాస్తవకు టెక్​బర్నర్ ఛానెల్ ‌‌ నుంచే నెలకు దాదాపు 15 లక్షల రూపాయలు వస్తున్నాయి. యూట్యూబ్ ‌‌తో పాటు కొన్ని కంపెనీల స్పాన్సర్​షిప్​లతో కూడా కొంత డబ్బు సంపాదిస్తున్నాడు. బ్రాండ్స్ ‌‌ ప్రమోషన్స్ ‌కూడా చేస్తుంటాడు. ఇప్పటివరకు యూట్యూబ్ ‌‌ నుంచి దాదాపు14 కోట్ల రూపాయలు సంపాదించాడు.