
విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్’. మను ఆనంద్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 11న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. సందీప్ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ హాజరై టీమ్‌కి విషెస్ చెప్పారు. మంచి కంటెంట్ ఉన్న చిత్రమని, అందరికీ నచ్చుతుందని, త్వరలోనే డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానని విష్ణు విశాల్ చెప్పాడు. మను ఆనంద్, మంజిమా మోహన్, రాకేందు మౌళితో పాటు విష్ణు విశాల్ వైఫ్ గుత్తా జ్వాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.