unstoppable 2 : ప్రభాస్, గోపీచంద్ ఏ హీరోయిన్ కోసం గొడవపడ్డారు..!

unstoppable 2 : ప్రభాస్, గోపీచంద్ ఏ  హీరోయిన్ కోసం గొడవపడ్డారు..!

రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన అన్ స్టాపబుల్-2 మొదటి పార్ట్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ బాలయ్య షోకి వెళ్తున్నాడు అన్న వార్త వినగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరిగింది. అంచనాలకు తగ్గట్టే మొదటి పార్ట్ సక్సెస్ అయింది. ప్రభాస్, బాలయ్య మధ్య జరిగిన ఫన్నీ కన్వజేషన్స్ ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఫోన్ కాల్ ద్వారా రామ్ చరణ్, బాలయ్య.. ప్రభాస్ ని ఆడుకున్నది షో మొత్తానికి హైలైట్. 

అయితే, ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పార్ట్ 2  ట్రైలర్ ని ఆహా నిన్న లాంచ్ చేసింది.  ‘మీరు చూసింది సగమే. చూడాల్సింది చాలా ఉంది. గెట్ రెడీ ఫర్ సమ్ అల్టిమేట్ ఫన్ రైడ్. సెకండ్ హాఫ్ లో రచ్చ మామూలుగా ఉండదు.’ అన్న ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. రెండో పార్ట్ లో సెకండ్ గెస్ట్ గా గోపీచంద్ రానున్నాడు. ఇందులో గోపీచంద్, ప్రభాస్ మధ్య స్నేహం గురించి మాట్లాడుకున్నారు. బాలకృష్ణ అడిగిన చిలిపి ప్రశ్నలకు ఇద్దరూ సిగ్గు పడుతూ సమాధానం చెప్పారు. మీ ఇద్దరు ఏ హీరోయిన్ కోసం గొడవ పడ్డారు? నయన తార, తమన్న ఇద్దరిలో ఎవరితో డేట్ కి వెళ్తారు? అన్న ప్రశ్నలకు ఈ ఇద్దరు అంతే చిలిపిగా సమాధానం ఇచ్చారు. ఈ ఎపిసోడ్  జనవరి 6 న ఆహాలో టెలికాస్ట్ కానుంది. పార్ట్ 1 ఎపిసోడ్ రిలీజ్ వల్ల ఆహా సర్వర్ క్రాష్ అయిన విషయం తెలిసిందే.