జలవనరుల్లో గలగల.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అలర్ట్..

జలవనరుల్లో గలగల.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో అలర్ట్..

హైదరాబాద్​లోని జంట జలాశయాలకు వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్ సాగర్​కు 1,200 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1,762.75 అడుగులకు చేరింది. 

దీంతో రిజర్వాయర్ రెండు గేట్లు ఒక ఫీటు మేర ఓపెన్ చేసి, 700 క్యూసెక్కులను మూసీలోకి వదులుతున్నారు. ఇక ఉస్మాన్ సాగర్​కు వెయ్యి క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,785.40 అడుగులకు చేరింది. మరోవైపు భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. 

దీని పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.62 మీటర్లకు చేరింది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. కాగా, హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాలైన చాదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌‌‌‌‌, మలక్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌, అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌లోని బస్తీవాసులను అప్రమత్తం చేశారు. 

మూసీకి సమీపంలో ఉన్నోళ్లను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.