ఏపీలో 54 వేల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు

ఏపీలో 54 వేల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు

ఏపీలో 54 వేల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు

మరో 9 వేల ఎకరాల లంక భూములకు కూడా..

రాష్ట్ర కేబినెట్​లో నిర్ణయం

అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుంది. అసైన్డ్, లంక భూములతో పాటు ఇనాం భూములపై లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించాలని నిర్ణయించింది. బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాకు వివరించారు. 20 ఏండ్ల కింద కేటాయించిన భూములపై లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. 

54 వేల ఎకరాల అసైన్డ్ భూములతో పాటు 9,062 ఎకరాల లంక భూములకు సాధారణ పట్టాలు అందజేస్తామని చెప్పారు. అలాగే నిషేధిత జాబితా (22ఎ) నుంచి ఇనాం భూములను తొలగించి, వాటి లబ్ధిదారులకు కూడా హక్కులు కల్పిస్తామని వెల్లడించారు. వైఎస్సాఆర్ సున్నా వడ్డీ పథకం అమలు, అమరావతిలో ఇండ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని  మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్​ పేర్కొన్నారు.