బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూ ప్రకంపనలు

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూ ప్రకంపనలు

బీహార్, పశ్చిమ బెంగాల్‌లో భూమి స్వల్పంగా కంపించింది. ఏప్రిల్ 12న ఉదయం 5 గంటల 35 నిమిషాల సమయంలో బీహార్‌లోని అరారియాలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీనితీవ్రత 4.3గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. పూర్నియాకు సమీపంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించింన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోనూ బుధవారం తెల్లవారుజామున భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. ఉదయం 5 గంటల 35 నిమిషాల సమయంలో సిలిగురిలో భూకంపం వచ్చిందని వెల్లడించింది. సిలిగురికి 140 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని పేర్కొంది.