రంగారెడ్డిలో టీచర్ల బదిలీలకు బ్రేక్‌‌.. సెప్టెంబర్ 19 వరకు హైకోర్టు స్టే

రంగారెడ్డిలో టీచర్ల బదిలీలకు బ్రేక్‌‌.. సెప్టెంబర్ 19 వరకు హైకోర్టు స్టే
  • రంగారెడ్డిలో టీచర్ల బదిలీలకు బ్రేక్‌‌
  • ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు : రంగారెడ్డి జిల్లాలో టీచర్ల ప్రమోషన్లను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఆర్డర్‌‌ జారీ చేసింది. ఈ నెల 19 వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్‌‌ దాఖలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ముఖ్య కార్యదర్శి, డీఈవో, డీఎస్‌‌ఈలకు నోటీసులు జారీ చేసింది. ఇతర జిల్లాలకు చెందిన టీచర్లను కూడా రంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తున్నారని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధమని, 

Also Raed:- తగ్గిన సన్నాల సాగు..పెట్టుబడి ఎక్కువ.. దిగుబడి తక్కువ 

ఆ విధంగా చేయకుండా ఉత్తర్వులివ్వాలంటూశ్రీనివాస్‌‌రెడ్డి సహా పలువురు స్కూల్‌‌ అసిస్టెంట్‌‌ టీచర్లు అత్యవసర లంచ్‌‌ మోషన్‌‌ పిటిషన్లు దాఖలు చేశారు.

జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లకు రంగారెడ్డి జిల్లాను కేటాయించారని, కేడర్‌‌ను మించిపోతే ఈ జిల్లాకు చెందిన తాము నష్టపోతామన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌‌ పి.మాధవీదేవి బెంచ్​ విచారణ చేపట్టింది. తుది సీనియారిటీ లిస్ట్ జారీ చేయకుండా టీచర్లకు ప్రమోషన్లు కల్పించడం లేదని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ లాయర్​ వాదించారు. లంచ్‌‌ మోషన్‌‌లో పిటిషన్‌‌ వచ్చినందున వివరాలు తెలుసుకోవడానికి ఈ నెల 19 వరకు సమయం కావాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను 19కి వాయిదా వేసింది. అప్పటివరకు ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.