ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు..భూకేటాయింపు చట్టబద్ధమే

ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు..భూకేటాయింపు చట్టబద్ధమే
  • హరీశ్ రావు పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టివేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా షేక్ పేట సర్వే నం.403లో ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఐదెకరాల భూ కేటాయింపు సబబేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆనంద్ సినీ సర్వీసెస్​కు భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు దాఖలు చేసిన పిల్​ను కొట్టివేస్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్​ల బెంచ్ ఇటీవల తీర్పు వెలువరించింది. సినిమా పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్​కు తరలించడంలో భాగంగా భూకేటాయింపు జరిపిందని, రాష్ట్రంలో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలోనే ఈ కేటాయింపు జరిగిందని తీర్పు చెప్పింది.

ఇందులో చట్టవిరుద్ధమైనది ఏమీ లేదని తెలిపింది. ప్రస్తుత కేసులో కూడా సినిమా పరిశ్రమ ప్రోత్సాహంలో భాగంగా భూముల కేటాయింపు జరిగిందని, గతంలో ఇదే విషయానికి సంబంధించి విచారించిన ఇతర పిటిషన్లలో భూ కేటాయింపు అంశం కూడా సమీక్షించిన విషయాన్ని తీర్పులో ప్రస్తావించింది. 2001లో జీవో జారీ అయితే ఏడేండ్ల తర్వాత దానిపై పిల్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. చాలా ఆలస్యంగా దాఖలైన పిల్​లో విచక్షణాధికారాన్ని వినియోగించి పాత అంశాలను పునఃసమీక్షించలేమని వివరిస్తూ పిల్​ను కొట్టివేసింది.

ఇందులో ప్రభుత్వం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయమేమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటలో 5 ఎకరాల భూమిని ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినీ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేటాయిస్తూ 2008లో జారీ చేసిన జీవో నం.744ను, 2001లో జారీ చేసిన జీవో నం.355ను సవాలు చేస్తూ హరీశ్ రావు 2008లో పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరాధే నేతృత్వంలోని బెంచ్​ విచారణ చేపట్టింది.