The Hundred 2025: ఫ్యాన్స్‌కు 100 కిక్: నేటి నుంచి హండ్రెడ్ క్రికెట్ లీగ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

The Hundred 2025: ఫ్యాన్స్‌కు 100 కిక్: నేటి నుంచి హండ్రెడ్ క్రికెట్ లీగ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

క్రికెట్ అభిమానులని అలరించడానికి మంగళవారం (ఆగస్టు 5) నుంచి ది హండ్రెడ్ 2025 ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇన్నింగ్స్ కు 100 బంతులు మాత్రమే వేస్తారు. పవర్ ప్లే లో 25 బంతులు ఉంటాయి. టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఓవల్ ఇన్విన్సిబుల్స్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్, సదరన్ బ్రేవ్, లండన్ స్పిరిట్, వెల్ష్ ఫైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్, ట్రెంట్ రాకెట్స్, నార్తర్న్ సూపర్‌చార్జర్స్ టైటిల్ కోసం పోరాడనున్నాయి. ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఆగస్టు 31తో ముగిస్తుంది. 

ALSO READ | Team India: మ్యాచ్‌లకు బ్రేక్.. ఇండియాలో కుర్రోళ్లకు టైంపాస్ ఎట్లా..?

ఈ టోర్నీలీగ్ దశలో మొత్తం 32 మ్యాచ్ లు జరగనున్నాయి. రౌండ్ రాబిన్ తరహాలో ఈ టోర్నీ జరగనుంది. ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టేబుల్-టాపర్ నేరుగా ఫైనల్‌కు వెళుతుంది. రెండు, మూడు స్థానాల్లో గెలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి.ఒకటే మ్యాచ్ ఉంటే రాత్రి 11:00 గంటలకు జరుగుతుంది. ఒకవేళ రెండు మ్యాచ్ లు ఉంటే రాత్రి 7:30 నిమిషాలకు తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. నేడు తొలి మ్యాచ్ లో లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ మధ్య జరుగుతుంది. మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ లో జరుగుతుంది.  డేవిడ్ వార్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్ ఆటగాళ్లపై అందరి దృష్టి నిలిచింది.      

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..? 

హండ్రెడ్ లీగ్ మ్యాచ్ లన్నీ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ సోనీలైవ్ యాప్ తో పాటు ఫ్యాన్‌కోడ్ యాప్ లో చూడొచ్చు.