రాజ‘శేఖర్’ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

రాజ‘శేఖర్’ సినిమా ప్రదర్శనలు నిలిపివేత

‘శేఖర్’ సినిమాకు ఊహించని షాక్ ఎదురైంది. సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జీవితా రాజశేఖర్ డబ్బులు చెల్లించలేదని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ‘శేఖర్’ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రంలోపు రూ.65 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. నగదు డిపాజిట్ చేయకపోతే శేఖర్ మూవీ అన్ని హక్కులు అటాచ్ చేయాలని ఆదేశించింది. థియేటర్లు, డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, యూట్యూబ్ లో ఎలాంటి ప్రసారాలు చేయొద్దని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు చాలాచోట్ల శేఖర్ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. 

సినిమా ప్రదర్శన నిలిపివేతపై రాజ‘శేఖర్’ స్పందన
శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేతపై హీరో రాజశేఖర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. శేఖర్ సినిమాను తనతో తన కుటుంబం సర్వస్వంగా భావించిందని, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డామని చెప్పాడు. ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో కావాలనే కొందరు తమపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మే 20వ తేదీన విడుదలైన శేఖర్ సినిమాలో హీరో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ నటించారు. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ నే తెచ్చుకుంది. ఈ మూవీలో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించింది.

మరిన్ని వార్తల కోసం..

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన కాశ్మీర్ యువకుడు..ఎలానో తెలుసా? 

బధిరుల ఒలింపిక్స్‌‌‌‌ అథ్లెట్లకు ప్రధాని ఆతిథ్యం