నిబంధనలు ఉల్లంఘించిన భారీ అపార్ట్‌మెంట్ కూల్చివేత

నిబంధనలు ఉల్లంఘించిన భారీ అపార్ట్‌మెంట్ కూల్చివేత

నిబంధనలను ఉల్లంఘించి కట్టారని కేరళలలో ఓ భారీ కాంప్లెక్స్ ను క్షణాల్లో కూల్చేశారు  అధికారులు. జనవరి 11, 12న రెండు  రోజుల పాటు అక్రమ కట్టడాలను కూల్చివేయనున్నారు.  మారడులోని అక్రమ కట్టడాలలో ఈ భారీ అపార్ట్ మెంట్ తో పాటు హోలీ ఫెయిత్, కయలోరం, ఆల్ఫా వెంచర్స్, హాలిడే హెరిటేజ్, జైన్ హౌసింగ్ అపార్ట్మెంట్ లను  కూల్చివేయనున్నారు.  కూల్చివేయబోతున్న కాంప్లెక్స్ ల చుట్టు పక్కల  ప్రాంతంలో  144 సెక్షన్ ను అమలు చేశారు పోలీసులు. మొత్తం 343 ప్లాట్లు 240 ఫ్యామిలీలు కాంప్లెక్స్ లలో ఉంటున్నాయి. పక్కన ఉన్న బిల్డింగ్ లకు ఎలాంటి నష్టం రాకుండా ఈ కాంప్లెక్స్ ను కూల్చివేశారు. ముందు జాగ్రత్తగా  200 మీటర్ల ప్రాంతంలో నివసించే ప్రజలు బయటకు వెళ్లాలని కోరారు. 

నిబంధనలు ఉల్లంఘించినందున  138 రోజుల్లో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు 2019 సెప్టెంబర్‌లో ఆదేశించింది.  తీర ప్రాంతంలో కాంప్లెక్స్ ను  కట్టినందుకు  నెలలోపు తొలగించాలని గత ఏడాది మే 8 న సుప్రీం కోర్టు ఆదేశించింది. త్రిసభ్య కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. అపార్ట్ మెంట్ యజమానులకు ఒక్కొక్కరికి రూ .25 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చాలా రోజులుగా కాంప్లెక్స్ లలో ఉన్న వారు ఖాళీ చేయడానికి నిరాకరించారు.. నిరసన తెలిపారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు.