
ఇంటర్నెట్....స్మార్ట్‌ఫోన్‌ల ప్రస్తుత కాలంలో.. యూజర్ డేటాను దొంగిలించడం, దాన్ని దుర్వినియోగం చేయడం సులభమైపోయింది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా...ఎంత అప్రమత్తంగా ఉన్నా...ఏదో విధంగా డేటా చోరీకి గురయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ల ద్వారా గూఢచర్యంతో పాటు..వినియోగదారు డేటా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు భారత ఐటి మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది.
స్మార్ట్‌ఫోన్‌లలో యాప్ లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో రకరకాల అనుమతులు కోరతాయి. వాటన్నింటికి అనుమతిస్తేనే మన ఫోన్ లో అవి ఇన్ స్టాల్ అవుతాయి. కానీ కొన్ని యాప్ లు ఫోన్ తో పాటు డిఫాల్ట్ గా వస్తాయి. అవి ఎటువంటి అనుమతులు అడగవు. కారణమేంటంటే అవి అప్పటికే ఇన్‌స్టాల్ అయిపోతాయ్. వీటిలో ఎక్కువగా ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక రకాల యాప్స్ ప్రీ -ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు వినియోగదారుల అనుమతి లేకుండా ఫోన్ లో ఉంటాయి. అయితే ఈ యాప్ లు యూజర్ల డేటాను రహస్యంగా నిల్వ చేస్తాయని ఓ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో వినియోగదారు డేటా సేకరించే ఈ యాప్ లను ప్రీ ఇన్ స్టాల్ సమయంలో డిఫాల్ట్ గా ఉండే నిబంధనను భారత ఐటి మంత్రిత్వ శాఖ తొలగించాలని చూస్తోంది.
స్మార్ట్ ఫోన్లలో ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లు వినియోగదారుల డేటాను సేకరించే అవకాశం ఉందని కేంద్ర ఐటీ శాఖకు సంబంధించిన ఓ అధికారి తెలిపారు. చైనాతో సహా ఇతర దేశాలు యూజర్ల డేటాను దోపిడీ చేయకుండా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. 2020లో దేశ సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణ తర్వాత ఆ దేశ దేశానికి సంబంధించిన డేటాను సేకరించేందుకు అనేక మార్గాలను ఎంచుకుంటోందని..చైనా ఆటలను కట్టించేందుకు Tik Tokతో సహా 300 కంటే ఎక్కువ చైనీస్ యాప్‌లను నిషేధించామని గుర్తు చేశారు. భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చైనా ..విదేశీ పౌరులపై గూఢచర్యం మొదలు పెట్టిందన్నారు. ఇందుకు Huawei, Hikvision వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందన్నారు. వీటిపై ఇప్పటికే అనేక దేశాలు ఆంక్షలు విధించాయని పేర్కొన్నారు.
మరోవైపు చాలా స్మార్ట్‌ఫోన్‌లలో డిలీట్ చేయలేని ముందే ఇన్‌స్టాల్ చేసిన యాప్‌లతో వస్తున్నాయి. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Xiaomi యొక్క యాప్ స్టోర్ GetApps, Samsung యాప్ స్టోర్ Samsung Pay, iPhone తయారీదారు Apple యొక్క బ్రౌజర్ Safar వంటివి అనేక స్మార్ట్ ఫోన్లు ప్రీ ఇన్ స్టాల్ యాప్ లను డేటా సేకరణ కోసం వాడుతున్నట్లు కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో వినియోగదారు డేటా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త నిబంధనలను అమలు చేయాలని చూస్తోంది. దీని ప్రకారం స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఫోన్లలో ప్రీ ఇన్ స్టాల్ యాప్ లను అన్‌ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా అప్షన్ అందించాలని ఆదేశాలు జారీ చేయనుంది. అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ద్వారా గుర్తింపు పొందాకే కొత్త మోడల్‌లు ఆవిష్కరించాలని నిబంధన చేర్చనుంది.