హైదరాబాద్లో ఈనెలలో వర్షమే పడదంట..

 హైదరాబాద్లో ఈనెలలో వర్షమే పడదంట..

భారత వాతావరణశాఖ ఉష్ణోగ్రతలు, వర్షాలపై కీలక అప్ డేట్ అందించింది. నవంబర్ నెలలో హైదరాబాద్ తో సహా తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసిన విషయాన్ని చెప్పింది. ముఖ్యంగా అక్టోబర్ లో సాధారణ వర్షపాతం నమోదైంది. కానీ.. నవంబర్ లో మాత్రం అసలు హైదరాబాద్​ లోనే వర్షమే పడదని చెప్పారు వాతావరణశాఖ అధికారులు.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల సీజన్, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు విస్తరించి ఉంటాయి. గత నెలలో ఖమ్మంలో అత్యధికంగా 142.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో మాత్రం140.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే.. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ నెలలో హైదరాబాద్ లో వర్షమే పడదని చెబుతున్నారు.

ఎప్పుడైనా సరే నవంబర్ నుండి జనవరి వరకు చలి ఎక్కువగా ఉంటుంది.ఈ మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతుంటాయి.  అయితే ఈ ఏడాది శీతాకాలం ఆలస్యమవుతుందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్‌లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD అంచనా వేసింది. అంటే చలి ఇంకా పెరగకపోవచ్చని సూచిస్తుంది. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఏడు రోజుల్లో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉంది.  హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD అంచనా వేసింది.

రాత్రి సమయంలోనూ ఉక్కపోత ఉంటుందని, పెద్దగా చలి ప్రభావం ఉండదని చెబుతున్నారు. మొత్తంగా నవంబర్ నెల వర్షపాతం లేకుండా కొరత- రికార్డు క్రియేట్ చేయనుంది. తెలంగాణ రాష్ట్రం మునుపెన్నడూ లేని విధంగా వర్షపాతం లోటును చవిచూసింది. కేవలం 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.