భారత నౌకాదళ చీఫ్ గా కరంబీర్ సింగ్ బాధ్యతలు

భారత నౌకాదళ చీఫ్ గా కరంబీర్ సింగ్ బాధ్యతలు

భారత నౌకాదళ చీఫ్ గా అడ్మిరల్ కరంబీర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో అడ్మిరల్ సినిల్ లంబా నుంచి కరంబీర్ బాధ్యతలు తీసుకున్నారు. అయితే మాజీ చీఫ్ అడ్మిరల్ సునిల్ లంబా ఇవాళ రిటైర్ అవ్వటంతో… 24వ నేవీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే బాధ్యతలను గౌరవంగా భావిస్తున్నానన్నారు కరంబీర్. అడ్మిరల్ సునిల్ లంబా చేసిన సేవలు మరువలేనివన్నారు.