ఈ నెల 19  నుంచి కేఫిన్ ఐపీఓ

ఈ నెల 19  నుంచి కేఫిన్ ఐపీఓ
  •     షేరు ధర రూ.347-366
  •     ఇష్యూ సైజ్ రూ.1,500 కోట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మ్యూచువల్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌కు టెక్ సర్వీస్‌‌‌‌లను అందించే హైదరాబాద్ కంపెనీ కేఫిన్  టెక్నాలజీస్ లిమిటెడ్‌‌‌‌ ఐపీఓ ఈ నెల 19– 21 మధ్య ఉంటుంది. ఫేస్‌‌‌‌ వాల్యూ రూ.10 ఉన్న  షేరును రూ.347–366   వద్ద పబ్లిక్ ఇష్యూలో కంపెనీ అమ్మనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌)  ద్వారా  కేఫిన్‌‌‌‌ టెక్ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ  రూ. 1,500 కోట్ల విలువైన షేర్లను  సేల్ చేస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూలో ఫ్రెష్‌‌‌‌గా ఇష్యూ చేసిన షేర్లను  అమ్మకానికి పెట్టడం లేదు.  

ప్రస్తుతం కంపెనీలో జనరల్ అట్లాంటిక్‌‌‌‌కు 75 శాతం వాటా ఉండగా, ఐపీఓ పూర్తయ్యాక ఈ వాటా 49 శాతానికి తగ్గుతుందని కేఫిన్ టెక్ సీఈఓ శ్రీకాంత్ నాదెళ్ల పేర్కొన్నారు.  కంపెనీ వాల్యుయేషన్ సుమారు రూ.6 వేల కోట్లుగా ఉందని చెప్పారు . ఇష్యూ చేస్తున్న షేర్లలో 75 శాతం వాటా క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం, 15 శాతం  నాన్ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోసం, 10‌‌‌‌‌‌‌‌ శాతం వాటాను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ కేటాయించింది. ఐపీఓలో  ఒక లాట్‌‌‌‌లో 40 షేర్లు ఉంటాయి. లోయర్ బ్యాండ్ దగ్గర కనీసం రూ. 13,880 పెట్టుబడి అవసరం.