ఈ క్రేజీ గాడ్జెట్స్ తో బైక్​ సేఫ్​

ఈ క్రేజీ గాడ్జెట్స్ తో బైక్​ సేఫ్​

రయ్‌‌‌‌ రయ్‌‌‌‌మని రైడ్‌‌‌‌కు వెళ్లాలనుకునేవాళ్లు.. స్మార్ట్‌‌‌‌గా ఆలోచించి కొన్ని గాడ్జెట్లు వెంట తీసుకెళ్తే.. ప్రయాణం ఇంకాస్త సాఫీగా సాగుతుంది. కొత్త ప్లేస్‌‌‌‌కి వెళ్లినప్పుడు.. వెహికిల్‌‌‌‌ సేఫ్టీ, వెంట తీసుకెళ్లిన గాడ్జెట్స్‌‌‌‌కి చార్జింగ్‌‌‌‌ పెట్టుకునే ఫెసిలిటీ.. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఎక్కువగా రైడ్స్‌‌‌‌కి వెళ్లేవాళ్ల కోసం కొన్ని క్రేజీ గాడ్జెట్స్‌‌‌‌…

కొత్త ప్లేస్‌‌‌‌లకు వెళ్లినప్పుడు బైక్‌‌‌‌ని ఎక్కడెక్కడో పార్క్‌‌‌‌ చేయాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు బైక్‌‌‌‌ సెక్యూరిటీ గురించి కచ్చితంగా కేర్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలి. కొన్నిసార్లు హ్యాండిల్‌‌‌‌ లాక్ వేసినా దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఎక్స్‌‌‌‌ట్రా సేఫ్టీ కోసం ఈ గ్రిప్‌‌‌‌ లాక్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని క్లచ్ లాక్, బ్రేక్ లాక్, హ్యాండిల్ బార్ లాక్ అని కూడా పిలుస్తారు. బ్రేక్ లివర్ లేదా క్లచ్ లివర్‌‌‌‌ ఎటాచ్‌‌‌‌ చేసి లాక్‌‌‌‌ చేస్తారు.  దీనివల్ల ఫ్రంట్‌‌‌‌ బ్రేక్ వైపు లాక్‌‌‌‌ వేస్తే యాక్సిలేటర్‌‌‌‌‌‌‌‌ తిప్పలేం. క్లచ్‌‌‌‌ ఉన్న వైపు వేస్తే.. క్లచ్‌‌‌‌ లివర్‌‌‌‌‌‌‌‌ని ఆపరేట్‌‌‌‌ చేయలేం. కాబట్టి బైక్‌‌‌‌ను దొంగిలించడం సాధ్యం కాదు. దీన్ని దాదాపు అన్ని రకాల బైక్‌‌‌‌లకు వాడు కోవచ్చు.

ట్యాంక్‌‌‌‌ బ్యాగ్‌‌‌‌

మనం రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా వాడే బైక్ ట్యాంక్ కవర్లతో పోలిస్తే ఈ ట్యాంక్‌‌‌‌ బ్యాగ్‌‌‌‌ చాలా పెద్దగా ఉంటుంది. ఫుడ్‌‌‌‌ డెలివరీ బాయ్స్‌‌‌‌కి, ఎప్పుడూ కెమెరాలు క్యారీ చేసే ఫొటో గ్రాఫర్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికున్న క్లిప్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ వల్ల పెట్రోల్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌పై ఈజీగా పెట్టుకోవచ్చు, తీసెయొచ్చు. బ్యాగ్‌‌‌‌ లోపలికి వర్షపు నీళ్లు వెళ్లకుండా ఉండేందుకు దీనిపై పాలిథిన్‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. బ్యాగ్‌‌‌‌లో మొబైల్‌‌‌‌ పెట్టుకుని నావిగేషన్‌‌‌‌ చూసుకోవడానికి ట్రాన్సపరెంట్‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.

బైక్ మొబైల్‌‌‌‌ చార్జర్‌‌‌‌‌‌‌‌

ఇప్పుడు అందరూ స్మార్ట్ డివైజ్‌‌‌‌లే వాడుతున్నారు. కాబట్టి లాంగ్‌‌‌‌ రైడ్‌‌‌‌ వెళ్లేవాళ్లకు ఎక్కువగా ‘చార్జింగ్‌‌‌‌’ ప్రాబ్లమ్‌‌‌‌ ఎదురవుతుంటుంది. ఎందుకంటే.. బ్లూటూత్‌‌‌‌ హెడ్‌‌‌‌సెట్‌‌‌‌, మొబైల్‌‌‌‌, స్పీకర్.. ఇలా మనతో క్యారీ చేసే ప్రతిదానికి చార్జింగ్ అవసరం. కాబట్టి వెంట తీసుకెళ్లిన పవర్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ కూడా వాటిని చార్జ్‌‌‌‌ చేయడానికి సరిపోదు. అందుకే బైక్‌‌‌‌కే మెబైల్‌‌‌‌ చార్జర్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంటే సరిపోతుంది. మార్కెట్‌‌‌‌లో చాలా కంపెనీల ‘బైక్‌‌‌‌ మొబైల్‌‌‌‌ చార్జర్లు’ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రోబోటచ్‌‌‌‌ లాంటి కంపెనీలు వాటర్‌‌‌‌‌‌‌‌ రెసిస్టెంట్‌‌‌‌తో కాంపాక్ట్ సైజులో చార్జర్లను తీసుకొస్తున్నాయి.

ఫింగర్‌ ప్రింట్‌ బైక్‌ స్టార్టర్

వెహికిల్స్‌‌‌‌ దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాబట్టి సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫింగర్‌‌‌‌‌‌‌‌ ప్రింట్‌‌‌‌ వెహికిల్‌‌‌‌ స్టార్టర్‌‌‌‌‌‌‌‌ వాడడం వల్ల ఈ ప్రాబ్లమ్‌‌‌‌కి సొల్యూషన్‌‌‌‌ దొరికినట్టే. ఈ సిస్టమ్‌‌‌‌లో వెహికిల్స్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేయాలంటే.. మనం రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ఫింగర్‌‌‌‌‌‌‌‌ ఫ్రింట్‌‌‌‌ని స్కానర్‌‌‌‌‌‌‌‌పై పెడితేనే బైక్‌‌‌‌ కదులుతుంది. లేదంటే బైక్ స్టార్ట్‌‌‌‌ అయ్యే ప్రసక్తే లేదు. ఓనర్‌‌‌‌‌‌‌‌ మారినప్పుడు, లేదంటే వేరేవాళ్లకు బైక్‌‌‌‌ ఇచ్చినప్పుడు ఫింగర్‌‌‌‌‌‌‌‌ ప్రింట్‌‌‌‌ను మార్చుకోవచ్చు. యూజర్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్లీ ఆపరేటింగ్‌‌‌‌ ఉంటుంది. ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువమంది ఒకే బైక్‌‌‌‌ని వాడుతుంటే.. వాళ్లందరి ఫింగర్‌‌‌‌‌‌‌‌ ప్రింట్స్ రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి.