
హైదరాబాద్, వెలుగు : కేఎస్‌సీ జర్నలిస్ట్ప్రీమియర్ లీగ్(జేపీఎల్) పోటీలు తుది దశకు చేరుకున్నాయి. జేపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం విజయానంద్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సెమీ ఫైనల్స్‌లో గెలిచిన.. రైజర్స్, థండర్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. సెమీస్‌కు త్రుక్ష ఫుడ్స్ ఎండీ భరత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియాలో క్రికెట్ గొప్ప ఆదరణ లభించి జనాలకు చేరువ కావడానికి, ఈ ఆట ఇంతలా డెవలప్ అవ్వడానికి స్పోర్ట్స్ జర్నలిస్టులు చేసిన కృషి గొప్పదన్నారు. నైపుణ్యం గల ప్లేయర్‌ను పైకి తీసుకురావడంలో జర్నలిస్టులు పడే తాపత్రయం, శ్రద్ధను ప్రశంసించారు.