
హైదరాబాద్: మూడు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు సీఎం కేసీఆర్. ఉన్నవి మూడు సీట్లు.. పదుల సంఖ్యలో ఆశావాహులు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రొఫైల్ పట్టుకొని క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఆశావాహుల చక్కర్లు కొడ్తున్నారు. కొందరు KCRతో క్లోజ్ గా ఉండే నేతలతో రెకమండేషన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ గడువు దగ్గర పడటంతో రేపే సీఎం రాజ్యసభ అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది. చాలామంది నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఒక సీటు ఖాళీ కాగా.. డీఎస్, కెప్టెన్ లక్ష్మీ కాంతరావు పదవీ కాలం ముగియడంతో మరో రెండ్లు సీట్లు ఖాళీ అయ్యాయి. 19వ తేదీలోపు బండ ప్రకాశ్ రాజీనామాతో అయిన సీటుకు, మిగతా రెండు సీట్లకు 24వ లోపు నామినేషన్ వేయాలి. దీంతో రేపు సాయంత్రంలోగా అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వార్తల కోసం..
ఖమ్మంలో మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మ దహనం
మీర్ పేట కార్పొరేషన్ లో బ్లడ్ బ్యాంక్ భవనం ప్రారంభం