ప్రశాంతంగా మద్యం షాపుల డ్రా

ప్రశాంతంగా మద్యం షాపుల డ్రా

ఖమ్మం టౌన్,వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఉన్న 122 షాపుల కేటాయింపులకు సంబంధించి లక్కీడ్రా ప్రశాంతంగా ముగిసింది. 122 మద్యం షాపులకు 7,207 దరఖాస్తులు అందాయి.  ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ జిల్లా సూపరిండెంట్ నాగేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో  అడిషనల్​ కలెక్టర్ డి.మధుసూధన్ నాయక్, కేఎంసీ కమిషనర్​ఆదర్శ్ సురభి, సీపీ విష్ణు వారియర్ బాక్స్ లో ఉన్న టోకెన్లు తీసి గెజిట్ షాపుల నెంబర్ల ప్రకారం విజేతలను ప్రకటించారు. షాపులను దక్కించుకున్న వారు వెంటనే ఎక్సైజ్ ఫీజు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ల ను ఏర్పాటు చేశారు.    

కొందరు సిండికేట్ గా ఏర్పడి 122 షాపులకు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరికొందరు ఎస్సీ,ఎస్టీ, గౌడ రిజర్వేషన్ లో షాపు దక్కించుకునేందుకు బినామీలను పెట్టి తమ అదృష్టాన్ని  పరీక్షించుకునారు.కమర్షియల్ పాయింట్స్, బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్న ఏరియాలలో అప్లికేషన్స్ ఎక్కువగా వేశారు. షాపు దక్కించుకున్న వారు షాపుల నిర్వహణపై అనుభవం లేని వారు, గుడ్ విల్ తీసుకుని షాపులు అప్పగించే పనిలో పడ్డారు.

షాపు దక్కించుకున్న లైసెన్స్ దారుడు గుడ్ విల్ తో పాటుగా ప్రతినెలా పారితోషకం చెల్లించేందుకు బేరసారాలు జరుపుతున్నట్లు సమాచారం. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా టౌన్ ఏసీపీ గణేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేవారు. డ్రా ప్రక్రియను  అడిషనల్ కలెక్టర్  మధుసూదన్ నాయక్, సీపీ విష్ణు వారియర్, మున్సిపల్​కమిషనర్ ఆదర్శ్ సురభి పర్యవేక్షణలో  నిర్వహించారు.

పీవోడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఆందోళన....

మద్యం షాపులకు డ్రా తీస్తున్న నేపథ్యంలో సోమవారం పీవోడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో  ఆందోళన నిర్వహించారు.ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని వన్ టౌన్ పీఎస్ కు తరలించారు. కార్యక్రమంలో శిరో మణి, రాకేశ్, ఝాన్సీ లక్ష్మీ,  ఆవుల మంగతాయి, గోకినేపల్లి సరోజిని,చైతన్య,భారతమ్మ,షాను, యశోదమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. 

భద్రాద్రి కొత్తగూడెంలో.. 

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని 88 వైన్​ షాప్​లను డ్రా పద్దతిలో  దరఖాస్తుదారులకు కేటాయించినట్టు కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అలా తెలిపారు. పాల్వంచలోని కేటీపీఎస్​ భద్రాద్రి ఆడిటోరియంలో ఎక్సైజ్​ అధికారులు వైన్​ షాప్​ల ఎలాట్​మెంట్​కు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో కలెక్టర్​ పాల్గొన్నారు. 88 షాప్​లకు 5,057 దరఖాస్తులు రావడంతో డ్రా పద్దతిలో దరఖాస్తు దారులను సెలెక్ట్​ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పటిష్ట బందోబస్తు మధ్య వైన్​ షాప్​లకు డ్రా తీశామన్నారు. డ్రాలో సెలెక్ట్​ అయిన వారిని చివరి వరకు బయటకు వెళ్లకుండా ఎక్సైజ్​ పోలీస్​లు జాగ్రత్తలు తీసుకున్నారు.  ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​  రాంబాబు, డిప్యూటీ ఎక్సైజ్​ కమిషనర్​ జనార్థన్​ రెడ్డి,  ఎక్సైజ్​ సూపరింటెండెంట్​ జానయ్య, పోలీస్​, ఎక్సైజ్​ అధికారులు పాల్గొన్నారు.