ఇప్పుడంతా ఓటీటీల మాయ..

ఇప్పుడంతా ఓటీటీల మాయ..
  • ఎవరి ఫోన్లో చూసినా ఓటీటీ యాప్లే
  • కరోనా దెబ్బకు థియేటర్ల మూసివేత
  • ప్రత్యమ్నాయంగా మారిన ఓటీటీ ప్లాట్ఫాం

ఒకప్పుడు కొత్త సినిమా రిలీజయిందంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడేవారు. పెద్ద హీరో సినిమా అయితే ఇక అంతే సంగతులు. టికెట్లు కూడా దొరికేవి కావు. థియేటర్ల ముందు ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా ఉండేది కాదు. తమ అభిమాన హీరోల ప్లెక్సీలకు పూలదండలు, పాలాభిషేకాలు...అబ్బబ్బో ఆ సీనే వేరు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడంతా ఓటీటీ మాయ. మీ చేతిలో సెల్ఫోన్ ..అందులో ఆహా, డిస్నీ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ వంటి యాప్లు.. ఈ యాప్లు మిమ్మల్ని చూపు తిప్పుకోకుండా కట్టిపడేస్తాయి. అందమైన సినీ ప్రపంచాన్ని మీ కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తాయి. మీ అభిమాన హీరో, హీరోయిన్లను మీ ముందు నిలబెట్టి డ్యూయెట్స్ చేపిస్తాయి. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ మూవీస్  దాకా అన్నీ ఇప్పుడు ఓటీటీలో వస్తున్నాయి. 

  • కరోనా దెబ్బకు థియేటర్ల మూసివేత..


కరోనా మహమ్మారి దెబ్బకు థియేటర్స్ దాదాపు మూతపడ్డాయి. ప్రభుత్వాలు లాక్డౌన్ విధిస్తుండటంతో థియేటర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సినిమా నిర్మాణానికి బడ్జెట్ ఎక్కువవుతుండటంతో నిర్మాతలు ఓటీటీలపై ఆధారపడుతున్నారు. కొన్ని సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసినా టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు ఓటీటీకే జై కొడుతున్నారు. మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీల్లో ఓటీటీ యాప్లు ఇన్స్టాల్ చేసుకుని ప్రేక్షకులు వినోదం పొందుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు యాప్ యజమాన్యాలు యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. కుకరీ షోస్, టాక్ షోస్, సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు, గేమ్స్, మూవీస్, సీరియల్స్ లాంటి రక రకాల వినోదాలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి ఈ యాప్లు. డబ్బున్న వాళ్లు హోం థియేటర్స్, ప్రొజెక్టర్స్, పెద్ద టీవీలలో వీక్షిస్తూ ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీల వల్ల  డబ్బు ఆదాతోపాటు సమయం కూడా కలిసివస్తోందని యూజర్లు చెబుతున్నారు. కరోనా వంటి రోగం నుంచి కూడా తమని కాపాడుకోవడానికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉపయోగపడుతున్నాయని వారు అంటున్నారు. 

ఇవి కూడా చదవండి

పెళ్లి కూతురైన ‘నాగిని’ హీరోయిన్

ఉద్యోగం రాక బాధతో రొడ్డెక్కిన యువకుడు