జైలర్ సినిమాలో మెగాస్టార్.. ఫోన్ చేసి మరీ వద్దని చెప్పేశారట

జైలర్ సినిమాలో మెగాస్టార్.. ఫోన్ చేసి మరీ వద్దని చెప్పేశారట

సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న సినిమాలు మరొకరితో చేయడం మామూలే. సినిమాలు మాత్రమే కాదు కొన్ని సినిమాల్లో నటీనటులు కూడా మారుతుంటారు. వాళ్ళకి డేట్స్ కుదరకపోవడమో, లేక ఆ పాత్రకు వారు సెట్ ఆవరనుకోవడమో జరుగుతూ ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే జైలర్(Jailer) సినిమా విషయంలో కూడా జరిగిందట. ఈ విషయాన్ని ఆ సినిమాలో రజనీకాంత్(Rajinikanth) కొడుకుగా నటించిన వసంత రవి(Vasantha ravi) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

అదేంటంటే.. ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా హైలెట్ అయ్యింది. వర్మాన్ పాత్రలో నటుడు వినాయకన్‌(Vinayakan) అద్భుతమైన నటనను కనబరిచారు. అయితే ముందుగా ఈ పాత్ర కోసం మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty)ని అనుకున్నాడట దర్శకుడు నెల్సన్ కుమార్(Nelson kumar). కానీ మమ్ముట్టిలాంటి స్టార్ హీరోకు ఇలాంటి పాత్ర ఇవ్వడం రజనికి నచ్చలేదట. అందుకే ఆయనే స్వయంగా మమ్ముట్టికి ఫోన్ చేసి.. మనం ఇది కాకుండా మరో సినిమాలో కలిసి చేద్దాం అని చెప్పారట. అలా ఈ సినిమాలో మమ్ముట్టి విలన్ గా చేయలేదు అని చెప్పుకొచ్చాడు వసంత రవి. ప్రస్తుతం ఈ నటుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే.. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.  దర్శకుడు నెల్సన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, తమన్నా, సునీల్, రమ్యకృష్ణ,యోగిబాబు ప్రధాన పాత్రల్లో కనిపించారు.