పవర్ స్టార్ మూవీపై ఫుల్ క్లారిటీ.. పక్కా అప్డేట్ ఇచ్చిన మేకర్స్

పవర్ స్టార్ మూవీపై ఫుల్ క్లారిటీ.. పక్కా అప్డేట్ ఇచ్చిన మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కొన్ని రోజుల నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పవన్. దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలపై అనేక రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. సినిమాలు ఆగిపోయాయని, ఎన్నికల తరువాత కూడా పెట్టెలేక్కే ఛాన్స్ లేదని రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. 

ఇందులో భాగంగానే తాజాగా పవన్ చేస్తున్న మరో సినిమాపై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అదే హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu). పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూర్య మూవీస్ పై ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా.. పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ అండ్ టీజర్ సినిమాపై హైప్ భారీగా క్రియేట్ చేయగా.. ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా హరి హర వీరమల్లు ఆగిపోయిందని, పవన్ కళ్యాణ్ నుండి నిర్మాతలు డబ్బులు వెనక్కి తీసుకున్నారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై హరి హర వీరమల్లు టీమ్ స్పందించింది.. హరి హర వీరమల్లు సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాబట్టి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికి ఈ సినిమా ఆడియన్స్ ను ఖచ్చితంగా అలరించే విదంగా ఉంటుంది. అంటూ నోట్ రిలీజ్ చేశారు. దీంతో హరి హర వీరమల్లు సినిమాఫై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.