నవీన్తో పరిచయమే..పెళ్లి జరగలేదు:బాధిత యువతి

నవీన్తో పరిచయమే..పెళ్లి జరగలేదు:బాధిత యువతి

కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ తో తనకు పెళ్లి జరగలేదని రంగారెడ్డి జిల్లా మన్నెగూడ యువతి క్లారిటీ ఇచ్చింది. తన పట్ల ఘోరంగా ట్రీట్ చేశాడని..నవీన్ అంటే తనకు ఇష్టం లేదని చాలాసార్లు అతనితో చెప్పానని పేర్కొంది. నవీన్ రెడ్డితో కేవలం పరిచయం మాత్రేమే ఉందని బాధితురాలు తెలిపింది. నవీన్ తనను చాలాసార్లు కొట్టినట్లు స్పష్టం చేసింది. అతను చెప్పేవన్నీ ఫేక్ మాటలేనని... తన పేరుతో ఫేక్ ఇన్ స్టా గ్రామ్ క్రియేట్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదైనా ఎక్కువ చేస్తే తన తండ్రిని చంపేస్తానని బెదిరించాడని చెప్పింది.

నవీన్ చెప్పేవన్నీ అన్నీ అబద్ధాలే అని బాధితురాలు తెలిపింది. పెళ్లి పేరుతో నవీన్ తనను ఇబ్బంది పెట్టాడని చెప్పింది. తనకు భయంగా ఉందని..తనకు సెక్యూరిటీ కావాలని పోలీసులను వేడుకుంది. కారు తన పేరు మీదనే ఉంది అనేది అవాస్తమని బాధిత యువతి స్పష్టం చేసింది.