నోస్​ మాస్క్ ఉంటే నో ప్రాబ్లమ్

నోస్​ మాస్క్ ఉంటే నో ప్రాబ్లమ్

కరోనా టైమ్​లో నలుగురిలో ఉన్నప్పుడు మాస్క్​ తప్పనిసరి. బయటికి వెళ్లినప్పుడు ఏమన్నా తినాలన్నా, తాగాలన్నా మాస్క్​తో ఇబ్బందిగా ఉంటుంది. అయితే, ఈ నోస్​ మాస్క్ ఉంటే ఆ ప్రాబ్లమ్​ రాదు. మాస్క్​ని ముక్కువరకు మడిచి, తినేయొచ్చు. దక్షణ కొరియాకు చెందిన అట్మన్​ అనే​ కంపెనీ ఈ మాస్క్​ తయారుచేసింది. ఈ కొత్తరకం మాస్క్​ పేరు ‘కోస్క్​’. కొరియన్​ భాషలో   ‘కో’ అంటే ముక్కు అని అర్థం. అందుకే  ముక్కుని మాత్రమే కప్పి ఉంచే ఈ మాస్క్​కి ‘కోస్క్​’ అనే పేరు పెట్టారు. ఈ మాస్క్​లో రెండు వరుసలు ఉంటాయి. నలుగురితో కలిసి తినేటప్పుడు, డ్రింక్స్​  తాగేటప్పుడు నోటిని కప్పే మాస్క్​ లేయర్​ని ముక్కువరకు మడిస్తే సరిపోతుంది. పది మాస్క్​లు ఉన్న బాక్స్​ ధర 9,800 వొన్ (మన కరెన్సీలో రూ.160)​.