రాష్ట్రంపై ద్రోణి ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన

రాష్ట్రంపై ద్రోణి ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన

రాష్ట్రంపై ద్రోణి ప్రభావం పడుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందన్నారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించారు. మరో వైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

చంచల్ గూడ జైలుకు డ్రగ్స్ కేసు నిందితులు