వడ్డీపై వడ్డీ మాఫీ.. పంట రుణాలకు నో రిలీఫ్

వడ్డీపై వడ్డీ మాఫీ.. పంట రుణాలకు నో రిలీఫ్

న్యూఢిల్లీ: వ్యవసాయం, దాని అనుబంధ  లోన్లకు వడ్డీపై వడ్డీ మాఫీ స్కీమ్ వర్తించదని ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎక్స్‌‌గ్రేషియా పేమెంట్ గ్రాంట్‌‌ కోసం తీసుకొచ్చిన స్కీమ్‌‌లో కాంపౌండ్ ఇంటరస్ట్‌‌కు, సింపుల్ ఇంటరస్ట్‌‌కు  మధ్యనున్న తేడాను వివరించింది. క్రెడిట్ కార్డుల బకాయిల విషయంలో బారోవర్స్‌‌కు రిలీఫ్ ఇచ్చేందుకు చూస్తున్నామని చెప్పింది. ఎక్స్‌‌గ్రేషియా రిలీఫ్ స్కీమ్ కిందకు తీసుకొచ్చిన 8 సెగ్మెంట్లలోకి పంట, ట్రాక్టర్ రుణాలు రావని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ రిలీఫ్ పొందే సెగ్మెంట్లలో ఎంఎస్‌‌ఎంఈ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, హౌసింగ్ లోన్లు, కన్జూమర్ డ్యూరబుల్ లోన్లు, క్రెడిట్ కార్డు బకాయిలు, ఆటో మొబైల్ లోన్లు, పర్సనల్ నుంచి ప్రొఫెషనల్ లోన్లు, కన్జంప్షన్ లోన్లు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వచ్చే నెల 5 నుంచి వడ్డీపై వడ్డీ స్కీమ్‌‌ అమలు చేయడం కోసం అన్ని లెండింగ్ ఇన్‌‌స్టిట్యూషన్స్‌‌ సిద్ధంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది.