బాలికను కిడ్నాప్ చేసి..బలవంతపు పెళ్లి

బాలికను కిడ్నాప్ చేసి..బలవంతపు పెళ్లి

తార్నాక,వెలుగుఓమైనర్​బాలికను కిడ్నాప్​చేసిన యువకుడు ఆమెను భువనగిరికి తీసుకువెళ్లి  బలవంతంగా పెళ్లిచేసుకున్నాడు. ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.వివరాల్లోకి వెళ్తే..నాచారం పీఎస్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో ఉండే ఓ మైనర్ బాలిక(17)ను  ప్రేమిస్తున్నానంటూ అదే ప్రాంతానికి చెందిన మహేశ్(21) కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆ బాలిక అందుకు ఒప్పుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం మహేశ్​ఆ బాలికను కిడ్నాప్ చేసి భువనగిరికి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. రెండు రోజులుగా కూతురు కనిపించకపోయేసరికి ఆమె తండ్రి బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావును సంప్రదించి విషయం చెప్పాడు. తర్వాత పోలీసులకు కంప్లయింట్ చేశాడు. ఈలోగా మహేశ్..ఆ బాలికను తీసుకుని తాను ఉంటున్న కాలనీకి వచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మహేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఆమె ఇంటికి పంపించారు. మైనర్ బాలిక తండ్రి ఇచ్చిన కంప్లయింట్ మేరకు మహేశ్ పై కిడ్నాప్, బలవంతపు బాల్యవివాహం, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఓమైనర్​బాలికను కిడ్నాప్​చేసి ఆమెను పెళ్లిచేసుకున్నమహేష్​కు సహకరించిన స్థానికులపై కూడా కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షులు అచ్యుతరావు పోలీసులను కోరారు.