విన్సన్​ పర్వతాన్ని అధిరోహించిన ‘యాదాద్రి’ యువతి

విన్సన్​ పర్వతాన్ని అధిరోహించిన ‘యాదాద్రి’ యువతి

విన్సన్​ పర్వతాన్ని అధిరోహించిన ‘యాదాద్రి’ యువతి

యాదాద్రి, వెలుగు : పర్వతారోహకురాలు పడమటి అన్విత అంటార్కిటికాలోని విన్సన్​పర్వతాన్ని ఈ నెల 17న అధిరోహించారు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన పడమటి అన్విత.. ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ ఇండియా నిర్వాహకుడు శేఖర్​బాబు వద్ద శిక్షణ పొందారు. 30 కిలోల బరువుతో సుమారు 10 రోజులు కష్టపడి సముద్ర మట్టానికి 4,892 మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతాన్ని ఎక్కి రికార్డు సృష్టించారు.

మొదటిసారిగా జనవరి 2021 ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని, 2021 ఫిబ్రవరిలో  హిమాలయాల్లోని ఖాడే , డిసెంబర్​2021న యూరప్​లోని ఎల్ర్బస్, మే 2022న ఎవరెస్ట్​ను, 2022 సెప్టెంబర్​లో మౌంట్​మన్సూ శిఖరాన్ని, ప్రస్తుతం విన్సన్​ పర్వతాన్ని అధిరోహించారు.  అన్విత తండ్రి మధుసూదన్​రెడ్డి రైతు కాగా, తల్లి చంద్రకళ అంగన్​వాడీ టీచర్.