అతనంటే చాలా ఇష్టం

అతనంటే చాలా ఇష్టం

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కొడుకు జైద్ ఖాన్ హీరోగా జయతీర్థ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బనారస్‌‌'. నవంబర్‌‌‌‌ 4న ఈ చిత్రం ప్యాన్‌‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న సందర్భంగా  హీరోయిన్  సోనాల్ మోంటెరో చెప్పిన ముచ్చట్లు.

‘‘ఆల్రెడీ ఎనిమిది కన్నడ సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో అందరికీ పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉంది. కాస్త నెర్వస్‌‌గా కూడా ఉంది. ఇప్పటికే పాటలు, ట్రైలర్ అందరికీ నచ్చాయి. సినిమా కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నా. లవ్, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ లాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. విజువల్‌‌ ట్రీట్‌‌లా ఉంటుంది. స్ట్రాంగ్‌‌ కంటెంట్. జయతీర్థ గారి సినిమాల్లో హీరోయిన్స్‌‌కి ఇంపార్టెన్స్ ఎక్కువే. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకం. ధని అనే అమ్మాయిగా కనిపిస్తా. నా చుట్టూనే కథ తిరుగుతుంది. నేను తుళులో కెరీర్ ప్రారంభించాను. తర్వాత కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టాను. తెలుగు భాష కూడా అర్థమవుతుంది. మంచి నటన కనబరిస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. సీతారామం, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు తెలుగులోనే చూశాను. విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టం. ‘కాంతార’ విషయంలో గర్వపడుతున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని అందంగా చెప్పారు. అయితే ‘బనారస్’ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జానర్స్ వేరు. ‘కాంతార’ని ఇష్టపడినట్లే ‘బనారస్’ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది. ప్రస్తుతం మూడు కన్నడ సినిమాలు చేస్తున్నా. సరోజినీ నాయుడు బయోపిక్‌‌లోనూ నటిస్తున్నా. ఇది కూడా ప్యాన్ ఇండియా సినిమానే.’’