
సుమంత్ హీరోగా టీజీ కీర్తికుమార్ తెరకెక్కించిన ‘మళ్లీ మొదలైంది’ మూవీ ఈ నెల 11న జీ5 ఓటీటీ ద్వారా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అడివి శేష్, నిఖిల్, విశ్వక్‌సేన్, సుశాంత్, బన్నీ వాస్ తదితరులు హాజరయ్యారు. ఇరవై తొమ్మిది రోజుల్లో సినిమాని పూర్తి చేశామని, ఈ కాన్సెప్ట్ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని దర్శక నిర్మాతలు అన్నారు. నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.