ముంబైలో దావూద్ అనుచరుల ఆఫీసులపై NIA దాడులు

ముంబైలో దావూద్ అనుచరుల ఆఫీసులపై NIA దాడులు

ముంబై : ముంబైలో గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సహచరులతో పాటూ హవాలా ఆపరేటర్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) దాడులు కొనసాగుతున్నాయి. ముంబైకి చేరుకున్న ఎన్ఐఏ టీం 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దావూద్ అనుచరులు, హవాలా వ్యాపారులే టార్గెట్ గా 40 చోట్లకుపైగా ఈ దాడులు జరుగుతున్నాయి. నాగ్ పగడా, పరేల్, బోరివలి, శాంతాక్రజ్, ముంద్రా, భెండీ బజార్ వంటి ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎన్ఐఏ దీనిపై కేసులు నమోదు చేసింది. 

UAPA కేసుకి సంబంధించి దావూద్ అసోసియేట్స్ పై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎన్ఐఏ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. డ్రగ్ సప్లయ్ దారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై నిఘా పెట్టింది. ఆయా సంస్థల కార్యకలాపాలను ఎన్ఐఏ నిశితంగా పరిశీలిస్తోంది. డీ కంపెనీకి చెందిన వివిధ కార్యకలాపాలపై ప్రధానంగా దాడులు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలో అలజడి కలిగించేందుకు దావూద్ అనుచరులు స్కెచ్ వేశారనే సమాచారంతో దాడులు జరుగుతున్నాయి. విదేశాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలు సాగించే వారిపై నిఘా కొనసాగుతోంది. దాడుల్లో లభించే సమాచారం బట్టి తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై మహిళా నేతల నిరసన

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు